- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రోలర్స్‌కు స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన స్టార్ హీరోయిన్ భర్త.. మీరు చీకట్లోనే బతకండి అంటూ పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి(Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రా(Raj Kundra) దంపతులపై రూ. 60 కోట్ల మోసం కేసు నమోదైన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి(Shilpa Shetty) భర్త రాజ్ కుంద్రా(Raj Kundra) దంపతులపై రూ. 60 కోట్ల మోసం కేసు నమోదైన విషయం తెలిసిందే. దీపక్ కోఠారీ అనే వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు జూహు పోలీస్ స్టేషన్‌లో వారిపై కేసు రిజిస్టర్ చేశారు. ఈనేపథ్యంలో.. శిల్పాశెట్టి సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటూ.. అధ్యాత్మి్ పాదయాత్రలో పాల్గొంది. దీంతో శిల్పాశెట్టిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ‘కేసులు ఉన్నోళ్లు ఇప్పుడు పాదయాత్రలు చేసి ఇమేజ్ క్లీన్ చేసుకుంటున్నారా?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ దంపతులను ఏకీపారేస్తున్నారు. గత కొద్ది కాలంగా ఈ సంఘటనపై పలు వార్తలు వస్తుండటంతో.. నెటిజన్లు విమర్శలు చేయడం మొదలెట్టారు. ఈక్రమంలో.. తాజాగా, ఈ విషయంపై శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా స్పందించి స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేశారు.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘చీకట్లోనే బతకాలనుకునేవాళ్లు ఎప్పటికీ ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ట్రోల్ చేస్తూ జీవితం గడపాలనుకునేవాళ్లు ఒకరోజు తెలుసుకుంటారు… ఆరోపణలు అంటే సత్యం కాదు. సనాతన ధర్మానికి నిలబడటం మీకు ఇబ్బంది కలిగిస్తే సమస్య మీలోనే ఉంది. చట్టం తన పని చేస్తుంది. స్క్రీన్‌షాట్‌లు తీసుకుని పోస్ట్‌లు పెట్టుకుంటూ జీవితం గడపండి’’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తప్పులు చేయడం ఎందుకు.. మాటలు పడటం ఎందుకు మళ్లీ జనాలను తిట్టడం ఎందుకని అంటున్నారు. అలాగే చేసే తప్పులన్నీ చేస్తూ సమర్ధించుకోవడం ఒకటని మండిపడుతున్నారు.






