మెడలో పాముతో షాకిచ్చిన స్టార్ హీరోయిన్?

by Disha Web Desk 8 |
మెడలో పాముతో షాకిచ్చిన స్టార్ హీరోయిన్?
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా తన అంద చందాలతో అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఇండియాకు వచ్చిన ఈ చిన్నది, తన భర్తతో కలిసి ముంబైలోని ఓ ఈవెంట్ లో పాల్గొంది. అయితే ఈ క్రమంలో ఆమె మెడలో ధరించిన పాము నెక్లెస్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

ఏంటీ ప్రియాంక పాముతో దర్శనం ఇచ్చింది అంటూ తన అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. అయితే చూడటానికి ఎంతో ట్రెండీగా, మంచిలుక్‌లో కనిపించిన ఆ నెక్లెస్ ధర చూపరులను ఎంతో ఆకట్టుకుంది. దీంతో దాని ధర ఎంత అని నెట్టింట్లో తెగ సెర్చ్ చేస్తున్నారు. కాగా, ఆ పాము నెక్లెస్ ధర చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.ప్రియాంక చోప్రా తన మెడలో ధరించిన సింపుల్ చిన్న పాము నెక్లెస్ ధర అక్షరాల 58 లక్షల 65 వేలు, ప్రస్తుతం దీని ధర తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంకొంత మంది సెలబ్రిటీస్ అంటే ఆ మాత్రం ఉండదా అని ముచ్చటిస్తున్నారు.

ఇక సౌత్,నార్త్ అనే తేడా లేకుండా రెండు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ప్రేక్షకుల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న వారిలో ప్రియాంక చోప్రా ఒకరు.ఈ అమ్మడు ప్రస్తుతం హాలీవుడ్‌లోనే ఎక్కువగా నటిస్తోంది. బాలీవుడ్‌ను వదిలేసి మరి హాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ చాలా బిజీ అయిపోయింది. ఈ నటి తెలుగులో కూడా రామ్ చరణ్ సరసన బ్రూస్‌లీలో నటించింది. ఇక ప్రియాంక చోప్రా తనకంటే వయసులో చిన్నవాడైన నటుడు,గాయకుడైన నిక్ జోనస్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక పాపకి సరోగసి ద్వారా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

Read More..

ఎన్నో సవాళ్లు ఎదురుకున్నా.. ఆమెనే నా ధైర్యం: సారా అలీఖాన్

Next Story

Most Viewed