- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సల్మాన్ ఖాన్ బాగోతం బయటపెట్టిన స్టార్ హీరోయిన్.. అతను చాలా చెడ్డ నటుడు అంటూ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్(Kareena Kapoor)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు ‘యాదేని’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్(Kareena Kapoor)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు ‘యాదేని’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్(Akshay Kumar), సల్మాన్ ఖాన్(Salman Khan), హృతిక్ రోషన్, అజయ్ దేవ్‌గణ్(Ajay Devgn), సైఫ్ అలీఖాన్ వంటి వారితో నటించి మెప్పించింది. అంతేకాకుండా కుర్ర హీరోల సరసన కూడా నటించిన ఈ భామ పలు బ్లాకం బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. రొమాంటిక్ కామెడీ నుంచి క్రైమ్ డ్రామా వరకూ ఎన్నో రకాల సినిమాలు చేసిన కరీనా, ఎన్నో అవార్డులు అందుకుంది. అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది కాలంగా రాణిస్తోంది. ఒక ఈ అమ్మడు అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. కరీనా కపూర్ గత ఏడాది ‘సింగం అగైన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది.
ఇక కరీనా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. సైఫ్ అలీఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే కరీనా కపూర్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా, కరీనా కపూర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై వివాదాస్పద కామెంట్లు చేసింది. ‘‘నేను సల్మాన్ అభిమానిని కాదు. నాకు అతన్ని ఇష్టం లేదు; అతను చాలా చెడ్డ నటుడు. అతను ఎప్పుడూ చులకనగా ఉంటాడని నేను అతనికి చెబుతున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






