బీచ్‌లో అతడికి లిప్ లాక్ ఇస్తూ రెచ్చిపోయిన స్టార్ బ్యూటీ.. ఛీ..ఛీ ఇదేం అరాచకం అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-17 14:23:49  IST  )

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు మోడల్‌గా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

బీచ్‌లో అతడికి లిప్ లాక్ ఇస్తూ రెచ్చిపోయిన స్టార్ బ్యూటీ.. ఛీ..ఛీ ఇదేం అరాచకం అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వీడియో)
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు మోడల్‌గా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా 2000సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. కొద్దికాలంపాటు బాలీవుడ్‌ను షేక్ చేసిన ఈ భామ హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ పలు సినిమాలు చేసి అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అక్కడ కూడా వరుస చిత్రాల్లో నటించిన ప్రియాంక భాషతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.

ప్రస్తుతం ఈ ప్రపంచసుందరి సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ‘ssmb-29’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రియాంక చోప్రా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. 2018లో అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిక్ కన్నా 10 సంవత్సారాలు పెద్దది కావడంతో వీరి పెళ్లి అప్పట్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అతని దగ్గర ఉన్న డబ్బు కోసమే చేసుకుందనే విమర్శలు కూడా వచ్చాయి.

అయినప్పటికీ వీరిద్దరు అవన్నీ పట్టించుకోకుండా లైఫ్ లీడ్ చేస్తున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది. ఈ జంట వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ పలు వెకేషన్స్‌కు వెళ్తూ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా, ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన భర్తతో కలిసి బీచ్‌కు వెళ్లిన ఆమె.. అతని పైకి ఎక్కి లిప్ లాక్ ఇస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు కొందరు లైక్స్ కొడుతున్నారు. అంతేకాకుండా క్యూట్‌గా ఉన్నారని కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు మాత్రం ఇదేం అరాచకం తల్లి అని తిడుతున్నారు.ఈ రొమాన్స్ ఇంట్లో చేసుకో అని అంటున్నారు. ప్రియాంక అభిమానులు మాత్రం ఆమె భర్తకు ముద్దు పెడితే తప్పేంటి అని వాదిస్తున్నారు.

Next Story