ఖతార్ ఎయిర్‌వేస్ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ హీరోయిన్..

by Disha Web Desk 6 |
ఖతార్ ఎయిర్‌వేస్ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్ హీరోయిన్..
X

దిశ, వెబ్ డెస్క్: ఖతార్ ఎయిర్‌వేస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను నియమించారు. ఆ విషయాన్ని ఖతార్ ఎయిర్‌వేస్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ హిస్ ఎక్సలేన్సీ అక్బర్ బేకర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయంలో హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బ్యూటిఫుల్ లుక్‌లో దీపికా ఆకట్టుకుంటుంది. ‘‘ప్రీమియం అనుభవంతో, ఎక్సలేన్స్‌కు, లగ్జరీకి పర్యాయపదంగా ఉన్న ఖతార్‌కు దీపిక గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం గర్వకారణం, ఇందుకు ప్రఖ్యాత నటి దీపిక సరైన ఎంపిక’’ అంటూ ఆమెకు సంబంధించిన ఓ బ్యూటిఫుల్ వీడియోను కూడా షేర్ చేశారు. దీంతో అది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : తెలంగాణ పల్లెటూరి నేపథ్యం బలగం

There's nothing else quite like the luxury of travelling with Qatar Airways ✈️ Introducing our brand-new film featuring our global brand ambassador @deepikapadukone pic.twitter.com/NjAgXInl7v

Next Story

Most Viewed