- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’ సినిమాలో లేడీ డాన్‌గా స్టార్ హీరోయిన్.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
కోలీవుడ్ హీరో ఆర్య(Arya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ ఎక్స్’(Mr. X).

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో ఆర్య(Arya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ ఎక్స్’(Mr. X). మను ఆనంద్ (Manu Anand)దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్(Sharath Kumar), అనఘా, రైజా విల్సన్, అతుల్య రవి, జయప్రకాష్, కాళి వెంకట్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి దిబు నినన్ సంగీతం అందిస్తుండగా.. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాగా.. విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నవంబర్ 30న విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ‘మిస్టర్ ఎక్స్’ సినిమాలో మంజు వారియర్ నటిస్తున్నట్లు ప్రకటించారు. నేడు ఆమె పుట్టినరోజు కావడంతో పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఒక చేతిలో బ్యాగ్ పట్టుకున్న మంజు వారియర్.. మరో చేతిలో గన్ పట్టుకుని గాగూల్స్ ధరించి ఉగ్రరూపంతో చూస్తూ నిల్చొని ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతోంది. లేడీ డాన్‌గా అమ్మడు లుక్ అదిరిందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.






