శింబు ‘అరసన్’ సినిమాలో స్టార్ హీరో.. అధికారిక ప్రకటనతో షాకిచ్చిన డైరెక్టర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-25 05:40:12  IST  )

నేషనల్ అవార్డు గ్రహిత వెట్రిమారన్ (Vetrimaran)దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది.

శింబు ‘అరసన్’ సినిమాలో స్టార్ హీరో.. అధికారిక ప్రకటనతో షాకిచ్చిన డైరెక్టర్
X

దిశ, సినిమా: నేషనల్ అవార్డు గ్రహిత వెట్రిమారన్ (Vetrimaran)దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇప్పటికే ఎన్నో హిట్స్ అందుకున్న ఆయన కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ‘అరసన్’ (Arasan)మూవీ చేస్తున్నారు. శింబు(Simbu)కి ఇది 49వ చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ‘అరసన్’ అంటే “రాజు” అన్న అర్థం. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ చూస్తే శింబు వింటేజ్ లుక్‌లో, చేతిలో కత్తి, పక్కనే సైకిల్, రక్తంతో తడిసిన చేతులు ఇవన్నీ కలిసి పక్కా వెట్రిమారన్ మార్క్ రా యాక్షన్ డ్రామా రాబోతుందనే హింట్ ఇస్తున్నాయి. ఈ సినిమాను కలైపులి ఎస్ థాను నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ గతంలో ధనుష్ హీరోగా వచ్చిన ’వడ చెన్నై’ యూనివర్స్‌లో భాగంగా ఉంటుందని సమాచారం.

ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఫిమేల్ లీడ్‌ రోల్‌కి సమంతని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెతో చర్చలు కొనసాగుతున్నాయని త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్ నడుస్తోంది. మరోవైపు హీరోయిన్ రేసులో కీర్తి సురేష్, శ్రీలీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమా మరింత హైప్ క్రియేట్ చేస్తూ వెట్రిమారన్ బిగ్ అప్డేట్‌ను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘అరసన్’ చిత్రంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi)జాయిన్ అయినట్లు స్వాగతం పలుకుతూ ఓ ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ ఇది మల్టీ స్టారర్ సినిమానా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

link

Next Story