- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుపై సినిమా చేయబోతున్న స్టార్ హీరో.. నెట్టింట చర్చనీయాంశంగా మారిన పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) ఇటీవల ‘సీతారే జమీన్ పర్’ (Sitare Zameen Par)చిత్రంతో వచ్చిన ఘన విజయాన్ని సాధించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) ఇటీవల ‘సీతారే జమీన్ పర్’ (Sitare Zameen Par)చిత్రంతో వచ్చిన ఘన విజయాన్ని సాధించారు. ఈ సినిమా జూన్ 20న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఆమిర్‌ఖాన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన మరో నిజ జీవిత ఘటన ఆధారంగా ఓ సినిమా చేయనున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసుపై ఆయన దృష్టి పెట్టినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన అన్ని విషయాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అసలు స్టోరీ ఏంటంటే.. ఇటీవల రాజా రఘువంశీ, సోనమ్ మే 11న ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇక అదే నెల 20న నవ దంపతులను కుటుంబ సభ్యులు హనీమూన్ కోసం మేఘాలయ పంపారు. మే 23న ఈ జంట స్కూటీపై టూరిస్ట్ స్పాట్ చూసేందుకు వెళ్లగా.. అక్కడ నుంచి రఘువంశీ(Raghuvamshi) కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత 11 రోజుల తర్వాత శవమై కనిపించడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేసి ఈ హత్య కేసులో నిందితులను పట్టుకున్నారు.
ముందుగా తన భార్యసోనమ్‌ను అనుమానించడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తప్పు ఒప్పుకుంది. ఇక ఈ స్టోరీనే ఆమిర్ ఖాన్ ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు బిగ్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్లు టాక్. గత రెండు రోజుల నుంచి ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. మేఘాలయ హత్య కేసు ఆధారంగా ఎలాంటి ప్రాజెక్ట్ తెరకెక్కించడం లేదని తెలిపారు. దీంతో ఈ వార్తలకు చెక్ పడినట్లు అయింది.






