‘స్పిరిట్’తో స్టార్ వారసుల ఎంట్రీ ఫిక్స్.. బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న సందీప్ రెడ్డి వంగా.. !

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-16 10:18:55  IST  )

ప్రభాస్(Prabhas) నటిస్తున్న సినిమాల్లో ‘స్పిరిట్’ (Spirit)ఒకటి. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్నారు.

‘స్పిరిట్’తో స్టార్ వారసుల ఎంట్రీ ఫిక్స్.. బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్న సందీప్ రెడ్డి వంగా.. !
X

దిశ, సినిమా: ప్రభాస్(Prabhas) నటిస్తున్న సినిమాల్లో ‘స్పిరిట్’ (Spirit)ఒకటి. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి ప్రభాస్ సరసన రొమాన్స్ చేయనుంది. ఇందులో శ్రీకాంత్, తరుణ్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. హర్షవర్థన్ రమేశ్వర మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక ఇందులో ప్రభాస్ మొదటిసారి పోలీసుగా నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. షూటింగ్ జరుపుకుంటున్న ‘స్పిరిట్’ అప్డేట్స్ కోసం అంతా ఎదురుచూస్తుండగా.. ఈ సినిమాకు సంబంధించిన వార్తలెన్నో వైరల్ అవుతున్నాయి.

ఇందులో సుధీర్ బాబు తనయుడు డార్లింగ్ చిన్నప్పటి క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ చిత్రంతో ఇద్దరు స్టార్ వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. ఇక ఈ వార్తలు చూసిన నెటిజన్లు హీరోలుగా అనుకుంటున్నారు. అసలు విషయంలోకి వెళితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్, రవితేజ కొడుకు మహదాన్ భూపతిరాజు ‘స్పిరిల్’ మూవీ కోసం అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరు షూట్‌లో జాయిన్ అయినప్పటికీ సందీప్ ప్రకటించకుండా.. డైరెక్ట్ థియేటర్స్‌లోనే ఈ విషయాన్ని వెల్లడించి ట్విస్ట్ ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

READ MORE ....

చిరంజీవితో ఆ సీన్ చేసి అద్దంలో నన్ను నేను చూసుకుని చాలా తిట్టుకున్నాను.. జ్యోతి వైరల్ కామెంట్స్

Next Story