'భోళా శంకర్' సెట్‌ని సందర్శించిన స్టార్ డైరెక్టర్.. పక్కా బిగ్ హిట్ అంటూ

by Disha Web Desk 7 |
భోళా శంకర్ సెట్‌ని సందర్శించిన స్టార్ డైరెక్టర్.. పక్కా బిగ్ హిట్ అంటూ
X

దిశ, సినిమా: చిరంజీవి, మెహర్ రమేష్ కలయికలో వస్తున్న 'భోళా శంకర్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 200 మంది డ్యాన్సర్లతో హైదరాబాద్‌లో వేసిన కోల్‌కతా సెట్‌లో ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ షూటింగ్‌కు హాజరైన లెజెండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు టీమ్‌తో కాసేపు సరదాగా గడిపారు. అలాగే 'ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాట 'రామ్మా.. చిలకమ్మా' లాగా బ్లాక్ బస్టర్ అవుతుంది.

'భోళా శంకర్' కూడా 'చూడాలనివుంది' సినిమాలాగే చిరంజీవి కెరీర్‌లో బిగ్ హిట్‌గా నిలిచిపోతుంది' అన్నాడు. అనంతరం రాఘవేంద్రరావుతో చిత్ర బృందం దిగిన ఫొటోను మేకర్స్ నెట్టింట షేర్ చేశారు. ఇక తమన్నా భాటియా కథానాయికగా నటిస్తున్న చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్‌గా కనిపించనుంది. క్రియేటివ్ కమర్షియల్స్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.



Next Story

Most Viewed