సినిమాలు లేక అలాంటి యాడ్స్ చేస్తున్న స్టార్ బ్యూటీ శ్రీలీల (వీడియో).. నెట్టింట ట్రోల్స్!

by Disha Web Desk 6 |
సినిమాలు లేక అలాంటి యాడ్స్ చేస్తున్న స్టార్ బ్యూటీ శ్రీలీల (వీడియో).. నెట్టింట ట్రోల్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని వరుస అవకాశాలు పొందింది. ఒకప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్ హీరోల క్రేజీ బ్యూటీగా మారిపోయిందనడంతో అతిశయోక్తి లేదు. వరుస సినిమాల్లో చాన్సులు కొట్టేసి స్టార్ బ్యూటీగా కొద్ది రోజులు ఇండస్ట్రీని ఏలింది. కానీ శ్రీలలకు ఇటీవల వరుసగా నాలుగు ఫ్లాప్‌లు రావడంతో కొన్ని కొత్త ప్రాజెక్టుల నుంచి కూడా తొలగించినట్లు తెలుస్తోంది. అయితే శ్రీలీల ఈ ఏడాది మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కానీ ఈ సినిమా జనవరి 12న విడుదలై అంతగా మెప్పించలేకపోయింది. ఇక అప్పటి నుంచి శ్రీలీలకు ఆఫర్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. మూవీస్‌లో అవకాశాలు లేకపోవడంతో శ్రీలీల ఖాళీగా ఉండకుండా చదువుకుంటూనే పలు యాడ్స్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంది. తాజాగా, శ్రీలీల ఓ సంస్థకు సంబంధించిన స్కూల్ యాడ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బస్సులో వెళ్తుండగా.. ఓ మహిళ తన భర్తతో కొడుకు రాహుల్ మార్కుల గురించి చెబుతూ జాబ్ మానేస్తాను అంటుంది.

ఇక అప్పుడే శ్రీలీల ఎంటర్ అయి ఈ స్కూల్‌లో మీ కొడుకును జాయిన్ చేయండి అని చెప్తుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే.. ఈ క్యాంపస్‌లో చేర్పించండి. ఐఐటీ, మెడిసిన్ ఏదైనా ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి క్రమశిక్షణతో పాటు మెరుగైన శిక్షణ ఇస్తారు అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను శ్రీలీల తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇక అది చూసిన వారంతా శ్రీలీలను ట్రోల్ చేస్తున్నారు. అలాగే కొందరు ఎంత తీసుకున్నావ్ ఇలాంటి యాడ్స్ చేసి బ్యాడ్ కాకని సలహాలు ఇస్తున్నారు.

Read More...

కారులో మంచులక్ష్మి హాట్ స్టిల్స్.. నీకు నిద్రలేకుండా చేస్తామంటూ నెటిజన్లు బోల్డ్ కామెంట్స్!

Next Story

Most Viewed