ఆదిపురుష్‌పై స్టార్ నటి సంచలన కామెంట్స్.. ప్రజల మనోభావాలను దెబ్బతియొద్దు అంటూ..

by Disha Web |
ఆదిపురుష్‌పై స్టార్ నటి సంచలన కామెంట్స్.. ప్రజల మనోభావాలను దెబ్బతియొద్దు అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా సినిమా 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2 న ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. సోషల్ మీడియాలో ఈ టీజర్‌పై అనేక విమర్శలు వస్తున్న క్రమంలో.. లెజెండ్రీ డైరెక్టర్ రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణంలో 'సీత' పాత్రలో నటించిన దీపికా చిక్లియా ఈ టీజర్‌పై స్పందించారు.

''సినిమాలో పాత్రలు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలి. శ్రీలంక పాత్ర అయితే మోఘల్‌లుగా కనిపించకూడదు. అయిన టీజర్‌లో అతన్ని నేను చూసింది కేవలం 30 సెకన్లు మాత్రమే కాబట్టి నాకు పెద్దగా అర్థం కాలేదు, కానీ అతను భిన్నంగా ఉన్నాడు. కాలం మారిందని, వీఎఫ్‌ఎక్స్‌ (విజువల్స్ ఎఫెక్ట్స్) అనేది చాలా అవసరం. దానికి నేను అంగీకరిస్తున్నాను. కానీ, అది ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉన్నంత వరకు మాత్రమే'' అంటూ చెప్పుకొచ్చింది.

ALSO READ : విడాకులు రద్దు.. మళ్లీ ఒకటికాబోతున్న స్టార్ కపుల్స్.. అభిమానులకు పండుగే

Next Story

Most Viewed