విడాకులు రద్దు.. మళ్లీ ఒకటికాబోతున్న స్టార్ కపుల్స్.. అభిమానులకు పండుగే

by Disha Web Desk 7 |
విడాకులు రద్దు.. మళ్లీ ఒకటికాబోతున్న స్టార్ కపుల్స్..  అభిమానులకు పండుగే
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ కపుల్స్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ధనుష్, ఐశ్వర్యా రజినికాంత్.. అభిప్రాయ భేదాలతో విడిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. అప్పట్లో వీరి విడాకుల పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు నిరాశ వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ధనుష్, ఐశ్వర్య విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే విడిపోతున్నామని చెప్పి సంవత్సరం గడవక ముందే.. వీరి విడాకుల విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

ఒకరిపై మరొకరికి అవితమైనప్రేమ ఉండటంతో ధనుష్, ఐశ్వర్య మళ్లీ ఒక్కటవ్వబోతున్నరనే వార్త కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతే కాకుండా ఇటీవలే వీరు విడాకులు కూడా రద్దు చేసుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు రజినీకాంత్ కుటుంబ సభ్యులు, ధనుష్ కుటుంబ సభ్యులు సమావేశమైనట్లు సమాచారం. ధనుష్, ఐశ్వర్య విడాకుల ప్రభావం పిల్లలపై పడకుండా ఉండటానికి వీరు కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారట. కాగా.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఇదే కనుక నిజం అయితే, అటూ రజినీకాంత్ కుటుంబ సభ్యులు, ఇటూ ధనుష్ కుటుంబ సభ్యులు.. వీళ్లతోపాటుగా అభిమానులు కూడా ఫుల్ ఖుష్ అవడం మాత్రం ఖాయం.

ALSO READ : ఆదిపురుష్‌పై స్టార్ నటి సంచలన కామెంట్స్.. ప్రజల మనోభావాలను దెబ్బతియొద్దు అంటూ..Next Story