- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీర్తి సురేష్ డ్రెస్సింగ్‌పై దారుణమైన ట్రోలింగ్.. షామియానా క్లాత్ అంటూ
స్టార్ నటి కీర్తి సురేష్ నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది.

దిశ, సినిమా: స్టార్ నటి కీర్తి సురేష్ నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. ఫిబ్రవరి 1న జరిగిన దర్శకుడు వెంకీ అట్లూరి పెళ్లికి హాజరైన బ్యూటీ సరికొత్త ఫ్యాషన్ లుక్‌లో దర్శనమిచ్చి నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఈ వేడుకలో అందరికంటే ఎక్కువగా ఆకర్షణగా నిలిచినప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం విమర్శలు ఎదుర్కొంటోంది. ఎందుకంటే కీర్తి డ్రెస్సింగ్ ఫంక్షన్లకి వాడే పలు రంగులు కలిసిన షామియానా లాగా ఉండటమే దీనికి కారణం. కాగా ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్స్‌పై పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'దుస్తువులను షామియానాతో కుట్టిస్తే ఇలాగే ఉంటుంది', 'మాకు తెలిసి మీరు వాటితోనే బట్టలు కుట్టించుకున్నట్లు అనిపిస్తోంది. షామియానా బేబీ అంటే మాకు చాలా ఇష్టం' అంటూ భిన్నంగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : రీ ఎంట్రీకి సిద్ధమైన మీరా జాస్మిన్.. ఆ పిక్స్ వైరల్!






