‘పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమాలో స్టార్ నటి.. పోస్టర్‌ విడుదల చేసి షాకిచ్చిన ఆర్జీవీ

by Mallepaka Hamsa |

ఒకప్పుడు హర్రర్ చిత్రాలు తెరకెక్కించి మంచి పాపులారిటీ దక్కించుకున్న ఆర్జీవీ ఆ తర్వాత జానర్ మార్చుకున్నారు.

‘పోలీస్ స్టేషన్ మే భూత్’ సినిమాలో స్టార్ నటి.. పోస్టర్‌ విడుదల చేసి షాకిచ్చిన ఆర్జీవీ
X

దిశ, సినిమా: ఒకప్పుడు హర్రర్ చిత్రాలు తెరకెక్కించి మంచి పాపులారిటీ దక్కించుకున్న ఆర్జీవీ ఆ తర్వాత జానర్ మార్చుకున్నారు. ఇక గత కొద్ది కాలంగా డైరెక్షన్‌పై అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దాదాపు ఐదు సంవత్సరాలు విరామం తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్జీవీ(RGV) మళ్లీ తనకు ఎంతో ఇష్టమైన హర్రర్ జానర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ (Police Station Main Bhoot)టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయీ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. జేనీలియా దేశ్‌ముఖ్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలై అందరినీ భయపెట్టింది.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో రోజు రోజుకు హైప్ పెరుగుతోంది. తాజాగా, ఆర్జీవీ ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ లో మరో నటి పోస్టర్ రిలీజ్ చేసి అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఈ చిత్రంలో స్టార్ నటి రమ్యకృష్ణ (Ramya Krishna)కూడా నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించాడు. ఫుల్ మేకప్, ఇంటి నిండా నగలు, ముఖంపై ఉన్న ఆర్ట్స్‌తో కొత్త అవతారంలో కనిపించింది. ముక్కు పుడక, కాటుక కళ్ళు, తిలకం, మొత్తం జుట్టు విరబోసుకుని మాత్రికురాలిగా కనిపించింది. ఇక అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొందరు మాత్రం శివగామిని ఇలా తయారు చేశారేంటి? అని అంటున్నారు.

మొత్తానికైతే.. రమ్యకృష్ణ లుక్ మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కాగా.. ఓ భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌ను.. పోలీస్ ఆఫీసర్ ఎన్‌కౌంటర్ చేయగా, రివేంజ్ తీర్చుకోవడానికి అతను దెయ్యంలా తిరిగొస్తే ఏం జరిగింది? అనేది ఇందులో చూపించబోతున్నారు. సినిమా మొత్తం హర్రర్, సస్పెన్స్ ఉండబోతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వావ్ ఎమిరేట్స్ మీడియా ప్రొడక్షన్, కర్మ మీడిచా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇక ఎక్కవ భాగం ఇండోర్ లోకేషన్లలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్స్‌లో రాబోతుంది.

link

Next Story