‘ఇడ్లీ కడై’ మూవీలో స్టార్ నటుడు.. మారి స్వామి ఈజ్ బ్యాక్ అంటూ మూవీ మేకర్స్ పోస్ట్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’(Idli Kadai).

‘ఇడ్లీ కడై’ మూవీలో స్టార్ నటుడు.. మారి స్వామి ఈజ్ బ్యాక్ అంటూ మూవీ మేకర్స్ పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) స్వయం దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’(Idli Kadai). ఈ సినిమాను డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో ధనుష్ సరసన నిత్యా మీనన్ (Nithya Menon)హీరోయిన్‌గా నటిస్తుండగా.. షాలిని పాండే, సత్యరాజ్, పార్తిబన్, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య అక్టోబర్ 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండటంతో మూవీ మేకర్స్ ‘ఇడ్లీ కడై’ నుంచి వరుస అప్డేట్ విడుదల చేస్తూ అంచనాలను పెంచుతున్నారు. తాజాగా, ఈ సినిమాలో సముద్రఖని నటిస్తున్నట్లు ప్రకటిస్తూ.. పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఆయన మారిస్వామిగా నటిస్తున్నాడు.ఇక విడుదల చేసిన పోస్టర్‌లో బ్లాక్ గాగూల్స్ పెట్టుకుని.. రెడ్ కలర్ షర్ట్ ధరించి గుడిసేపై చేతి వేసి విలన్ లుక్‌లో కనిపించారు. అనుభవజ్ఞులైన సముద్రఖని మళ్లీ మారి స్వామిగా తిరిగి వచ్చారు అని చిత్రబృందం వెల్లడించింది.

link

Next Story