- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మహాకాళి’ మూవీలో అసుర గురు శుక్రచార్యగా స్టార్ నటుడు.. పోస్టర్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Verma) ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు

దిశ, సినిమా: టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Verma) ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను కనీవిని ఎరుగని రీతిలో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ప్రశాంత్ వర్మ ఫుల్ బిజీ అయిపోయారు. దీంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూడీ ప్రాజెక్ట్‌గా ఓ పవర్ ఫుల్ స్టోరీ ‘మహాకాళి’(Mahakali)కూడా రాబోతుంది. బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాల ఆధారం, మతపరమైన గంభీరత, స్థానిక పౌరాణిక చరిత్రలతో అనుసంధానం చేయబడింది. ఇక ఈ మూవీకి ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజా అపర్ణ (Puja Aparna)దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలవగా.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘మహాకాళి’ అప్డేట్స్ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చి ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రంలో ‘ఛావా’ విలన్ అక్షయ్‌ఖన్నా నటిస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఆయన ఇందులో అసురగురు శుక్రచార్యగా నటిస్తున్నట్లు వెల్లడిస్తూ.. ‘‘దేవతల నీడలలో..తిరుగుబాటుకు ప్రకాశవంతమైన జ్వాల పెరిగింది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేస్తోంది.






