జక్కన్న భారీ ప్లాన్... మహేష్ బాబు కోసం రెండు పాత్రలు!

by velandi.Saikiran |   (  Updated:2025-06-15 13:08:39  IST  )

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu)... గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ ( Krishna) వారసత్వా

జక్కన్న భారీ ప్లాన్... మహేష్ బాబు  కోసం రెండు పాత్రలు!
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu)... గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ ( Krishna) వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు ప్రిన్స్ మహేష్ బాబు. కామెడీ, యాక్షన్ అలాగే రొమాంటిక్, క్రైమ్ ఇలా ఎలాంటి కథలు వచ్చిన సరే.. సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ప్రిన్స్ మహేష్ బాబు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయారు.

దానికి తగ్గట్టుగానే... భారీగానే రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారు ప్రిన్స్ మహేష్ బాబు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం... దర్శక ధీరుడు రాజమౌళితో ( Raja mouli) కొత్త సినిమా చేస్తున్నారు ప్రిన్స్ మహేష్ బాబు. సాఫ్ట్ గా ఉండే ప్రిన్స్ మహేష్ బాబు... రాజమౌళితో సినిమా అంటేనే ఓ రేంజ్ లో.. అంచనాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై... అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కనిపించబోతున్నారు.

హాలీవుడ్ రేంజ్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు కోసం భారీ ప్లాన్ చేశారట రాజమౌళి. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర పై కొత్త న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తారని అంటున్నారు. సినిమా మొదటి పార్ట్ లో నెగిటివ్ రోల్ లో మహేష్ బాబు కనిపిస్తారని... టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ ప్రచారం జోరు అందుకుంది. అలాగే సెకండ్ హాఫ్ లో.. ఆయన పాత్ర పాజిటివ్ గా మారుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్రైజేషన్ హైలెట్ గా నిలుస్తుంది అని చెబుతున్నారు. అంతేకాదు భారీ జంగిల్ అడ్వెంచర్ ఇందులో ఉంటుందట.

Next Story