- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SSMB 29 నుంచి టీజర్..ఏకంగా 25 వేల మందితో జక్కన్న ప్లానింగ్ !
SSMB 29 నుంచి టీజర్.. నవంబర్ 15వ తేదీన ఈ సినిమా టీజర్ వదులుతారని చర్చ జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో ఒక ఈవెంట్

దిశ, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 50 సంవత్సరాలు వయసు ఉన్న మహేష్ బాబు, యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీని ఇస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు... తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అలాంటి ప్రిన్స్ మహేష్ బాబు, ప్రస్తుతం జక్కన్నతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
SSMB 29 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరావేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా చేయనుండగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఒక్క పోస్టర్ మాత్రమే రాగా తాజాగా కీలక అప్డేట్ రానున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతుంది. నవంబర్ 15వ తేదీన ఈ సినిమా టీజర్ వదులుతారని చర్చ జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో ఒక ఈవెంట్ ఏర్పాటుచేసి, టీజర్ వదిలాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. ఆ ఈవెంట్ కు కేవలం 25 వేల మంది మాత్రమే హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు గానీ, ఈ న్యూస్ వైరల్ గా మారింది.






