కెన్యాలో ‘SSMB-29’ షూటింగ్.. బిగ్ ట్విస్ట్ ఇస్తూ మంత్రి ముసాలియా షాకింగ్ ట్వీట్‌.. ఏకంగా 120 దేశాల్లో

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-03 05:32:40  IST  )

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘SSMB-29’.

కెన్యాలో ‘SSMB-29’ షూటింగ్.. బిగ్ ట్విస్ట్ ఇస్తూ మంత్రి ముసాలియా షాకింగ్ ట్వీట్‌.. ఏకంగా 120 దేశాల్లో
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘SSMB-29’. ఇందులో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి సైతం నిత్యం ఈ చిత్రంపై హైప్ పెంచుతున్నాడు. SSMBప్రకటన వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో బజ్ మామూలుగా లేదనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కెన్సాలో జరుగుతున్నట్లు ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాది ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మూవీ టీమ్ వారని మర్యాద పూర్వకంగా కలిసి ఫొటోలు షేర్ చేశారు. ఈ మేరకు ఓ సంచలన విషయాన్ని కూడా బయటపెట్టడంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అసలు అందులో ఏముందంటే.. ‘‘దర్శకధీరుడు రాజమౌళి గత రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నారు.

చాలా శక్తివంతమైన కథలు, విజులవ్స్‌ను లోతైన సాంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆయన ఎంతో ప్రసిద్ధి చెందారు. 120 మంది సిబ్బందితో కూడిన అతని బృందం తూర్పు ఆఫ్రికా అంతటా విస్తృతమైన స్కౌటింగ్ పర్యటన తర్వాత కెన్యాను ఎంచుకుంది. మసాయి మరా మైదానాల నుంచి మొదలు సుందరమైన నైవాషా, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రాంతాలు ఆసియాలోని అతిపెద్ద చలనచిత్రంగా తెరకెక్కుతున్న మూవీలో భాగం కాబోతున్నాయి. అలాగే ఈ సినిమాను మూవీ టీమ్ ఏకంగా 120 దేశాల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు మాకు చెప్పారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైనే చేరువవుతుందని నేను అనుకుంటున్నా. కెన్యాలో షూటింగ్ చేయడం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

మా దేశ అందాలను, అతిథ్యాన్ని సుందర దృశ్యాలను చూపడంలో ఈ సినిమా శక్తవంతంగా పనిచేయనుంది. ‘SSMB-29’ చిత్రంతో మా కెన్యా చరిత్రను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో నాకు గర్వంగా అనిపిస్తుంది. ఈ రోజు నుంచే షూటింగ్ జరగబోతుంది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ అవుతుందని తెలుసుకున్న నెటిజన్లు, సూపర్ స్టార్ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీంతో షాక్ అవుతున్న బ్రహ్మానందం ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు.

LINK

Next Story