మ‌హేష్ - జ‌క్క‌న్న మూవీ టైటిల్ ఇదే.. లీక్ చేసిన ఫ్యాన్స్ ?

by velandi.Saikiran |

వారణాసి ( Varanasi ) అనే టైటిల్ ను రాజమౌళి ఫిక్స్ చేశారని ప్రచారం సాగుతోంది

మ‌హేష్ - జ‌క్క‌న్న మూవీ టైటిల్ ఇదే.. లీక్ చేసిన ఫ్యాన్స్ ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మహేష్ బాబు, తనకంటూ ఒక బ్రాండ్ తెచ్చుకున్నాడు. దాదాపు 50 సంవత్సరాలు వచ్చినప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్నాడు మహేష్ బాబు. అయితే ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పురాణాలకు సంబంధించి ఈ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దాదాపు రెండు సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ జరగనుంది అంట.

అంటే ఏ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. విదేశాల్లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రియాంక చోప్రా ( Priyanka Chopra ) ఈ సినిమాలో హీరోయిన్ గా మెరువబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సినిమా టైటిల్ పై తాజాగా ఆసక్తికర అప్డేట్ వచ్చింది. సింపుల్ టైటిల్ తో ఈ సినిమా రాబోతున్నట్లు కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. వారణాసి ( Varanasi ) అనే టైటిల్ ను రాజమౌళి ఫిక్స్ చేశారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇదే టైటిల్ అయితే, ఇందులో రామాయణం గురించి కూడా కథ ఉంటుందని కొంతమంది వార్తలు వైరల్ చేస్తున్నారు. అంతేకాదు మహేష్ బాబు రాముడి గెటప్ ఫోటోలు కూడా కొంతమంది క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. క్లిక్

Next Story