- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SSMB 29 నుంచి మరో బిగ్ అప్డేట్... అక్కడే 100 రోజులు!
ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని

దిశ, వెబ్ డెస్క్ : ప్రిన్స్ మహేష్ బాబు ( Mahesh Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి... దూసుకు వెళ్తున్నాడు మహేష్ బాబు. ఏజ్ పైబడినప్పటికీ... టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోలకు పోటీని ఇస్తున్నారు మహేష్ బాబు. అయితే అలాంటి ప్రిన్స్ మహేష్ బాబు... దర్శక ధీరుడు రాజమౌళితో ( SS Raja Mouli) సినిమా చేస్తున్నాడు.
వీరిద్దరి కాంబినేషన్ లో SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతోంది. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మూవీలో మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా ప్రియాంక చోప్రా హీరోయిన్ అని ప్రచారం జోరు అందుకుంది. అలాగే ఇతర పాత్రలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా మహేష్ బాబు- దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ వస్తున్న సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా షూటింగ్ త్వరలోనే వారణాసికి ( Varanasi ) షిఫ్ట్ కానుందట. ఈ నెల చివర లో చిత్ర బృందం మొత్తం.. వారణాసికి వెళ్ళబోతున్నట్లు సమాచారం అందుతుంది. మహేష్ బాబు కూడా... వంద రోజులపాటు వారణాసిలోనే ఉండబోతున్నారట. వంద రోజులు సరిగ్గా షూటింగ్ ఉందని తెలుస్తోంది. దీనికోసం 50 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించారట. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






