- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘SSMB-29’: మహేష్ బాబుకు అన్నగా ఆ స్టార్ హీరో.. బ్లాక్ బస్టర్ హిట్ రిపీట్ అంటున్న ఫ్యాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli) కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘SSMB-29’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు న్యూ లుక్‌లో కనిపించబోతున్నారు. అయితే రాజమౌళి ఈ మూవీని భారీ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను రీసెంట్‌గా గుట్టు చప్పుడు కాకుండా చేసిన విషయం విదితమే. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)), విలన్ క్యారెక్టర్‌లొ మలయాళ స్టార్ పృధ్వీ రాజ్ సుకుమారన్(Prudhwi Raj Sukumaran) నటించనున్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబుకు అన్నగా విక్టరీ వెంకటేష్(Venkatesh) నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మహేష్- వెంకీ కాంబోలో అప్పట్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఇక ఈ సారి కూడా వీరి కాంబినేషన్ సెంటిమెంట్‌గా బాగా కలిసి వస్తుందని, ఆ సినిమాలానే ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ రిపీట్ అవుతుందని నెటిజన్స్‌తో పాటు ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.






