ఛత్రపతి నుంచి SSMB 29 వరకు ఆ ఒక్క సెంటిమెంట్ తో సక్సెస్!

by velandi.Saikiran |   (  Updated:2025-08-10 09:23:01  IST  )

రాజమౌళి... శివుడి సెంటిమెంట్ తో సక్సెస్ అందుకుంటున్నాడని సోషల్ మీడియాలో ఒక పోస్టర్ వైరల్ అవుతుంది.

ఛత్రపతి నుంచి SSMB 29 వరకు ఆ ఒక్క సెంటిమెంట్ తో సక్సెస్!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కో అడుగు వేసుకుంటూ.. ఉన్నత స్థానాలకు ఎదిగారు రాజమౌళి. ఆస్కార్ అవార్డు రేంజ్ కు కూడా తెలుగు ఇండస్ట్రీ ని తీసుకువెళ్లిన ఘనత కేవలం రాజమౌళికి మాత్రమే దక్కుతుంది. అయితే అలాంటి రాజమౌళి... శివుడి సెంటిమెంట్ తో సక్సెస్ అందుకుంటున్నాడని సోషల్ మీడియాలో ఒక పోస్టర్ వైరల్ అవుతుంది.

ఛత్రపతి నుంచి చూస్తే... ఆ సినిమాలో గంగలో దొరికిన ఓ చెంబు ద్వారా విలన్లను కొడతాడు ప్రభాస్. శివునికి సంబంధించిన కథలో భాగంగానే చెంబు సీన్ పెట్టారట. అలాగే మర్యాద రామన్న సినిమాలో... సునీల్ వెళ్లిన ఇంట్లో కూడా శివుడి విగ్రహాన్ని చూపిస్తారు. అటు మగధీర విషయానికి వస్తే... కొండపైన మొత్తం డోలా శంకరుడి విగ్రహాన్ని పెట్టేశారు. ఆయనకు పూజలు చేయడం.. ఢమరుకం మోగించడం లాంటివి రాజమౌళి క్రియేట్ చేశారు.

బాహుబలి సినిమాలో కూడా శివున్ని వాడుకున్నారు రాజమౌళి. ఇందులో శివుడి విగ్రహాన్ని తన ఒంటిచేత్తో ప్రభాస్.. లేపేసి.. రచ్చ రచ్చ చేస్తాడు. ఇక ఆస్కార్ అవార్డుకు చేరిన RRR సినిమాలో కూడా శివుడి విగ్రహం కనిపిస్తుంది. అలాగే ఓం అనే లాకెట్ ను కూడా మనకు చూపించారు. ఇక లేటెస్ట్ గా మహేష్ బాబు తో జక్కన్న సినిమా చేస్తున్నాడు. నిన్న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా... శివుడి నామాలు, నంది అలాగే శూలం ఉన్న లాకెట్ పోస్టర్ రిలీజ్ చేసి.. అందరినీ ఆకట్టుకున్నారు రాజమౌళి. ఇలా ప్రతి సినిమాలో శివుడిని వాడుకొని రాజమౌళి హిట్ అందుకుంటున్నారని చర్చ జరుగుతోంది.

Next Story