- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్‌కు రూ. 80 కోట్ల ఖర్చు.. అందుకే సంతృప్తి పొందామన్న కార్తికేయ
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్‌కు రూ. 80 కోట్ల ఖర్చు.. అందుకే సంతృప్తి పొందామన్న కార్తికేయ
by Phanindra |
‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెయిన్‌కు రూ. 80 కోట్లు ఖర్చు చేశారనే విమర్శలు వచ్చాయి.

X
దిశ, సినిమా : ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ క్యాంపెయిన్‌కు రూ. 80 కోట్లు ఖర్చు చేశారనే విమర్శలు వచ్చాయి. ఇదంతా భరించలేకే నిర్మాత డీవీవీ దానయ్య వీటన్నింటికీ దూరంగా ఉన్నాడనే న్యూస్ స్ప్రెడ్ అయింది. కాగా ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కొడుకు ఎస్‌ఎస్ కార్తికేయ. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన.. అసలు ఈ రూ. 80కోట్ల మ్యాటర్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో ఇప్పటికీ అర్థం కావట్లేదన్నాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’కు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు వరించిన వేళ.. తప్పకుండా ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్స్‌కు ఎంట్రీ ఇస్తుందని అనుకున్నాం కానీ అది జరగకపోవడంతో కాస్త డిజప్పాయింట్ అయినట్లు తెలిపాడు. అయితే అంతకు ముందు జేమ్స్ కేమరూన్, స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి ప్రముఖులు ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే ఆస్కార్ వచ్చినంత సంతృప్తి పొందామని చెప్పాడు కార్తికేయ.
Next Story






