పుష్ప-2’ నుంచి శ్రీవల్లీ లుక్స్ లీక్.. రష్మిక ఎంత అందంగా ఉందో చూస్తే అదుర్స్ అనాల్సిందే!

by Disha Web Desk 6 |
పుష్ప-2’ నుంచి శ్రీవల్లీ లుక్స్ లీక్.. రష్మిక ఎంత అందంగా ఉందో చూస్తే అదుర్స్ అనాల్సిందే!
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ఎంతలా హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా 2021లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఇందులో నటించిన నటీనటులందరికీ ఒక్కసారిగా పాపులారిటీ పెరిగిపోయింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు పుష్ప-2 రాబోతుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

కాగా ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్స్‌లో ఘనంగా రిలీజ్ కానుంది. తాజాగా, షూటింగ్ సెట్‌నుంచి హీరోయిన్ రష్మిక లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె రెడ్ కలర్ చీరలో.. బంగారు ఆభరణాలు ధరించి ఎంతో అందంగా కనిపించింది. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక దాన్ని చూసిన వారంతా తెగ మురిసిపోతున్నారు. రష్మిక శ్రీవల్లి గెటప్‌లో చూడముచ్చటగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read More..

బ్రా లేకుండా టూ సెక్సీగా రెడీ అయిన సమంత.. ప్రీతమ్ రియాక్షన్‌కు ఫ్యాన్స్ షాక్!



Next Story

Most Viewed