- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఇద్దరు హీరోల కోసం ఏదైనా చేస్తా.. రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తానంటూ శ్రీనిధి శెట్టి కామెంట్స్
యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinithi Shetty) ‘కేజీఎఫ్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinithi Shetty) ‘కేజీఎఫ్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘తెలుసు కదా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda)హీరోగా నటిస్తుండగా.. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా.. అక్టోబర్ 17న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.
ఈనేపథ్యంలో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన శ్రీనిధి శెట్టి వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. తాజాగా, శ్రీనిధి ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇందులో భాగంగా యాంకర్.. మహేష్ బాబు, ఎన్టీఆర్‌తో అవకాశాలు వస్తే మీరు ఏ హీరోతో చేస్తారని ప్రశ్నించగా.. శ్రీనిధి స్పందిస్తూ.. ‘‘ఒకేసారి ఆ ఇద్దరితో నటించే అవకాశం వస్తే నేను కచ్చితంగా ఆ చిత్రాలను చేస్తాను.
ఈ ప్రాజెక్ట్స్ కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి పని చేస్తాను. మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం రావడం కోసం ఎంతో మంది సెలబ్రిటీలు ఎదురుచూస్తుంటారు. అలాంటికి ఇద్దరి సినిమాల్లో నాకు ఒకే సారి చాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. వారిద్దరూ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. కాబట్టి వారి కోసం నేను ఏమైనా చేస్తాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీనిధి కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






