- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నానికి జోడీగా కేజీఎఫ్ హీరోయిన్.. చిత్రీకరణ కూడా స్టార్ట్
దిశ, సినిమా: ‘దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం’ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న నేచురల్ స్టార్ నాని.. ప్రజెంట్ ‘హిట్ 3’తో బిజీగా ఉన్నాడు. శైలేశ్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ‘హిట్ 2’కు సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి సందడి చేయనుందని తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ వైజాగ్‌లో జరుగుతోందని తెలుస్తుండగా.. ఇందులో నాని, శ్రీనిధిలకు సంబంధించిన కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు టాక్. ఈ నెల రెండో వారం వరకు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్లు సమాచారం.
కాగా.. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇటీవల ‘హిట్ 3’ నుంచి ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అర్జున్ సర్కార్‌గా నాని చాలా మాస్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.
- Tags
- srinidhi shetty