- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాల్లోనే ఢీ కొన్న రెండు హెలికాఫ్టర్లు.. ప్రముఖ సింగర్, యూట్యూబర్లు దుర్మరణం
బ్రెజిల్ లోని రియో డి జనీరోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని పశ్చిమ ప్రాంతంలో రెండు హెలికాఫ్టర్లు గాల్లో ఉండగానే ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: బ్రెజిల్ లోని రియో డి జనీరోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని పశ్చిమ ప్రాంతంలో రెండు హెలికాఫ్టర్లు గాల్లో ఉండగానే ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్లో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంపై మిలిటరీ ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారుల సమాచారం ప్రకారం.. ప్రమాదానికి గురైన ఒక హెలికాప్టర్ స్థానిక కార్ల డీలర్‌షిప్ పార్కింగ్ స్థలంలో కుప్పకూలింది. అక్కడ పార్క్ చేసి ఉన్న పలు ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకోగా, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. గాల్లో హెలికాఫ్టర్లు ఎలా ఢీ కొన్నాయన్నదానిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రముఖ అమెరికన్ సింగర్ ఆలివర్ ట్రీ మృతి చెందినట్లు అనుమానాలు
ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. అయితే, ఏవియేషన్ అధికారులకు అందించిన ప్రయాణికుల జాబితాలో ప్రముఖ అమెరికన్ సింగర్, కమెడియన్ ఆలివర్ ట్రీ (Oliver Tree) పేరు ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఆలివర్ జూన్ 4న అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరిస్‌లో ప్రదర్శన ఇచ్చారు. శనివారం కూడా ఆయన బ్రెజిల్ వీధుల్లో సాకర్ ఆడుతున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
ప్రముఖ యూట్యూబర్ 'గాస్పి' దుర్మరణం
అర్జెంటీనాకు చెందిన ప్రముఖ స్ట్రీమింగ్ ఛానెల్ 'బ్లెండర్' కథనం ప్రకారం.. యూట్యూబ్‌లో 28 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న 23 ఏళ్ల ప్రముఖ కంటెంట్ క్రియేటర్ గాస్పర్ ప్రిమ్ డియాజ్ (Gaspar Prim Díaz) అలియాస్ 'గాస్పి' (Gaspi) కూడా ఈ హెలికాప్టర్లలో ఒకదానిలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. "నీ కళకు, మ్యాజిక్‌కు ధన్యవాదాలు. నిన్ను మేమంతా ఎప్పటికీ మిస్ అవుతాం" అంటూ బ్లెండర్ సంస్థ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా సంతాపం ప్రకటించింది.






