తాళాలు పగలగొట్టి మరీ.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించిన స్థానికులు!

by Jakkula.Mamatha |

డబుల్ బెడ్ ఇండ్ల పంపిణీలో ఆలస్యం కావడంతో స్థానిక పేద ప్రజలు ఎవరికి వారే ఇండ్లు ఆక్రమించారు.

తాళాలు పగలగొట్టి మరీ.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించిన స్థానికులు!
X

దిశ, నూతనకల్: డబుల్ బెడ్ ఇండ్ల పంపిణీలో ఆలస్యం కావడంతో స్థానిక పేద ప్రజలు ఎవరికి వారే ఇండ్లు ఆక్రమించారు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 32 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించారు. ఇప్పటికీ అవి పంపిణీ చేయడం ఆలస్యం కావడంతో స్థానిక ప్రజలు ఆగ్రహంతో సోమవారం ఎవరికి వారే ఇండ్ల తాళాలు పగలగొట్టి డబుల్ బెడ్ రూములు ఆక్రమించారు. ఈ సందర్భంగా ఎస్సై నాగరాజు మాట్లాడుతూ.. ఎవరు ఇండ్లు ఆక్రమించకూడదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు. ఎవరికి వారే ఆక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Next Story