పెళ్లి చేసుకోబోతున్న యాంకర్ శ్రీముఖి.. అధికారికంగా ప్రకటిస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

by Disha Web Desk 6 |
పెళ్లి చేసుకోబోతున్న యాంకర్ శ్రీముఖి.. అధికారికంగా ప్రకటిస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి పలు షోస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత ఆమె పలు చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెరను షేక్ చేస్తోంది. వరుస షోస్‌తో ప్రేక్షకులను అరిస్తూ ఓ ఊపు ఊపేస్తుంది. ఓ వైపు టీవీ షోలు చేస్తూనే కొన్ని స్పెషల్ షోస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలు షేర్ చేసి వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీముఖి పెళ్లి పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నాకు వయసు పెరుగుతుంది. పెళ్లి ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ఇంట్లో ప్రెజర్ ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ మా పేరెంట్స్ నుంచి నాకు ఎలాంటి ఒత్తిడి లేదు. వాళ్లు పెళ్లి గురించి చెప్పింది ఒక్కటే నువ్వు షోస్ చేసి ఎంతో మందిని అలరిస్తున్నావు. నీ రంగంలో నీవు ముందుకు వెళ్తున్నావు. అలాగే నీ జీవితాన్ని ముందుకు కొనసాగించు మేము నిన్ను ఆపం. నీకు పెళ్లి చేసుకోవాలని పించినప్పుడు చేసుకో, మేము నిన్ను బలవంతం పెట్టం అని నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ప్రస్తుతం నేను పలు షోస్ చేస్తూ చాలా బిజీగా ఉన్నాను. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనైతే లేదు. నేను ఎంత లౌడ్ స్పీకర్ అనేది మీకు తెలుసు. కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నేనే లౌడ్‌గా ప్రకటిస్తాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More..

ఎద అందాలు చూపిస్తూ.. హాట్ స్టిల్స్ తో రెచ్చిపోయిన శ్రీముఖి..!


Next Story