Sreeleela : శ్రీలీలది ఐరన్​లెగ్గా... గోల్డెన్​ లెగ్గా...

by Disha Web Desk 15 |
Sreeleela : శ్రీలీలది ఐరన్​లెగ్గా... గోల్డెన్​ లెగ్గా...
X

దిశ, వెబ్​డెస్క్​ : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల అనే చెప్పాలి. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నారు. ఈమె నటించిన సినిమాలు ప్రతి నెలా తప్పకుండా రిలీజ్​ అవుతున్నాయి. అయితే వీటిలో చాలా వరకు ప్రేక్షకుల ఆదరణ పొందడం లేదు. అడపాదడపా మాత్రం సూపర్​హిట్​ అవుతున్నాయి. దీంతో సినిమా అభిమానుల్లో కొందరు ఈమెది ఐరన్​ లెగ్​ అంటుంటే మరి కొందరు మాత్రం కాదుకాదు గోల్డెన్​ లెగ్​ అంటున్నారు. ఈమె తెలుగులోకి రాకముందు కన్నడ చిత్రాల్లో నటించారు. తెలుగులో పెళ్లి సందడి సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా అందరినీ ఆకట్టుకుంది.

తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో నటించారు. ఇది సూపర్ హిట్ అయింది. అలాగే స్కంద సినిమాలో నటించగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఆది కేశవ లో నటించగా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే వక్కంతం వంశీ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా కూడా తీవ్ర నిరాశపరిచింది.

ఇలా ప్రతి నెలా ఈమె సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో కొన్ని హిట్​ అవుతుంటే మరికొన్ని ఫ్లాప్​ లిస్టులో చేరుతున్నాయి. ఇక ఈమె నటించిన గుంటూరు కారం సినిమా జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి దీని భవిష్యత్​ ఎలా ఉంటుందో అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. అసలు ఈమెది ఐరన్​లెగ్గా... గోల్డెన్​ లెగ్గా అని కొందరు జుట్టుపీక్కుంటున్నారు. మరి కొందరు మాత్రం సినిమా హిట్​ అనేది అదృష్టంపై కూడా ఆధారపడి ఉంటుందని చెప్పుకొస్తున్నారు. నటించిన అన్ని సినిమాలు హిట్​ కావాలనేది దురాశే అని మరికొందరు సరిపుచ్చుకుంటున్నారు.

Read More..

అది కనిపించేలా.. హాట్ ఫొటోలు షేర్ చేస్తూ హీట్ పెంచుతున్న రకుల్ !



Next Story