చిరంజీవి సినిమాలో శ్రీ లీల

by Disha Web Desk 10 |
చిరంజీవి సినిమాలో  శ్రీ లీల
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి గ్యాప్ లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ ‘భోళా శంకర్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోలకతాలో స్టార్ట్ అయింది. ఆ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోస్, చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇందులో మెగాస్టార్ టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తుండగా.. ఇక ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే చిరు ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణతో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథా చర్చలు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా కీలకపాత్రలో కనిపించనుండగా. తనకు జోడీగా శ్రీ లీల ఫిక్స్ అయినట్లు టాక్. దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉండగా.. సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం

Also Read...

చిరంజీవి మూవీలో ‘డీజే టిల్లు’ సిద్ధు జొన్నలగడ్డ

Next Story

Most Viewed