- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బాస్ విన్నర్ తనే.. యాజమాన్యం కావాలనే ఇదంతా చేస్తుంది.. బయటకొచ్చి బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ఫైర్ స్టార్మ్స్ అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మరో చాన్స్ అంటూ భరణికి మరో అవకాశం.. నవ్వులు, లవ్ స్టోరీలు, కోపాలు, కొట్లాటల నడుమ మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ఫైర్ స్టార్మ్స్ అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మరో చాన్స్ అంటూ భరణికి మరో అవకాశం.. నవ్వులు, లవ్ స్టోరీలు, కోపాలు, కొట్లాటల నడుమ మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇన్ని జరిగినా.. ఎవరు ఎంత ప్రాణం పెట్టినా.. విన్నర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందనే రూమర్ ఎప్పటి నుంచో ఉంది. తనూజను ఆల్రెడీ విన్నర్ చేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేశారని.. అందుకే ఆమె ఏ తప్పు చేసినా.. హోస్ట్ కూడా కూల్‌గానే డీల్ చేస్తున్నాడని.. వేరే వాళ్లను మాత్రం చాలా దారుణంగా మాట్లాడుతున్నాడని టాక్. ఈ మధ్య వీకెండ్ ఎపిసోడ్స్‌లోనూ డిమాన్‌ను అంత దారుణంగా ట్రీట్ చేసిన నాగ్.. వారానికి 35 సార్లు గొడవ పెట్టుకున్న తనూజకు మాత్రం కూల్‌గా ఆన్సర్ ఇచ్చా డని అంటున్నారు.
ఇక ఈ మధ్య మళ్లీ హౌజ్‌లోకి ఎంటరయ్యేందుకు ఓ ఛాన్స్ అందుకున్నట్లే అందుకుని కోల్పోయిన శ్రీజ కూడా ఇలాంటి అరోపణలే చేసింది. ప్రతీ వీక్ ఆమెను కన్ఫెషన్ రూమ్‌కు పిలుస్తారని.. దాదాపు ముప్పై నలభై నిమిషాలు మాట్లాడుతుందని ఆరోపించింది. ఆల్మోస్ట్ ఆమెనే బిగ్ బాస్ విన్నర్‌గా ప్రకటిస్తారని ఇండైరెక్ట్ హింట్ ఇచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.






