రోషన్‌తో రిలేషన్‌షిప్‌పై స్పందించిన శ్రీదేవి.. అందుకే అంత క్లోజ్ అయ్యామంటూ కామెంట్స్

by Mallepaka Hamsa |

నిజానికి ‘కోర్ట్’ సినిమా కంటే ముందే మా మధ్య పరిచయం ఉంది. మేమిద్దరం చైల్డ్ ఆర్టిస్టులుగా ఉన్నప్పటి నుంచే ఒకరికొకరు తెలుసు.

రోషన్‌తో రిలేషన్‌షిప్‌పై స్పందించిన శ్రీదేవి.. అందుకే అంత క్లోజ్ అయ్యామంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘కోర్ట్’ సినిమాతో వెండితెరపై మ్యాజిక్ చేసిన క్రేజీ జంట రోషన్( Roshan)- శ్రీదేవి(Sridevi). ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేయడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ జోడీ మరోసారి జతకట్టబోతోంది. సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్యాండ్‌మేళం’ అనే చిత్రంతో మార్చి 26న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఈ క్రమంలో.. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రోషన్, శ్రీదేవిలకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ‘మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.. దీనిపై మీ సమాధానం ఏంటి?’ అని అడగ్గా, శ్రీదేవి చాలా కూల్‌గా క్లారిటీ ఇచ్చారు.

శ్రీదేవి మాట్లాడుతూ.. ‘‘నిజానికి ‘కోర్ట్’ సినిమా కంటే ముందే మా మధ్య పరిచయం ఉంది. మేమిద్దరం చైల్డ్ ఆర్టిస్టులుగా ఉన్నప్పటి నుంచే ఒకరికొకరు తెలుసు. అయితే అప్పుడు ఎలా పరిచయం అయ్యామో ఇప్పుడు సరిగ్గా గుర్తు లేదు కానీ, అప్పటి నుంచే మేం మంచి స్నేహితులం. మా మధ్య ఎంతో చొరవ ఉంది, అందుకే ఒకరినొకరు ఒరేయ్, పోరా అని పిలుచుకుంటాం. ‘కోర్ట్’ సినిమా షూటింగ్ సమయంలో మా స్నేహం ఇంకా బలపడి మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం’’ అని చెప్పుకొచ్చారు. తెరపై మమ్మల్ని చూసి అందరూ ప్రేమికులు అనుకుంటారని, అలాంటి కామెంట్స్ చూసినప్పుడు తమకు చాలా నవ్వు వస్తుందని ఆమె తెలిపారు. తమ మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని స్పష్టం చేయడంతో, గత కొంతకాలంగా వీరిపై వస్తున్న ప్రేమ పుకార్లకు చెక్ పడినట్లయింది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘బ్యాండ్‌మేళం’ ఈసారి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Next Story