- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోలీవుడ్‌లో బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీదేవి.. హీరో ఎవరంటే?
యంగ్ హీరోయిన్ శ్రీదేవి(Sridevi) అప్పల ‘కోర్టు’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ శ్రీదేవి(Sridevi) అప్పల ‘కోర్టు’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇందులో నటించిన శ్రీదేవికి ఫుల్ పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. కేజీఆర్‌కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, శ్రీదేవికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆసక్తిని పెంచుతోంది. ఈ భామ కోలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కెన్ కరుణాస్(Ken Karunas) హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీదేవి హీరోయిన్‌గా చేస్తున్నట్లు టాక్. స్కూల్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో అనిష్మా(Anishma), ప్రియాంశి యాదవ్(Priyanshi Yadav), సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలో నటిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘కాదలన్’ టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండగా.. శ్రీదేవి బంపర్ ఆఫర్ అందుకుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






