- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న శ్రీ విష్ణు.. ఆ స్పెషల్ డే నాడు బిగ్ అప్డేట్ అంటూ పోస్ట్
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu) పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్రంతో హీరోగా మాడాడు. ఆ తర్వాత ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి మెప్పించాడు. హిట్, ఫ్లాప్ అని ఆలోచించకుండా విభిన్న కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఇటీవల ‘సింగిల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ హిట్ అందుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రీ విష్ణు ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నట్లు ప్రకటించాడు. ఇందులో మహిమా నంబియార్ రాధికా శరత్ కుమార్, షైన్ టామ్ చావ్కో, ఉపేంద్ర లిమాయే, సాయిచంద్, బ్రహ్మాజీ, సత్య, రెడిన్ కింగ్స్లీ, శత్రు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ సినిమాకు జానకిరామ్ మారెళ్ళ (Janakiram Marella)దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కోన వెంకట్, బాబీ కొల్లి సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని స్కంద వాహన మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ‘SV-19’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ తుపాకుల నేపథ్యంలో ఉన్న కథతో రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ అక్టోబర్ 2న విజయదశమి నాడు మధ్యాహ్నం 12:06 గంటలకు అనౌన్స్ చేయబోతున్నట్లు ఓ చిన్న క్లిప్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో గంభీరమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తుండగా.. ఎరుపు రంగు క్లాత్‌తో పాటు అన్ని తుపాకులను చూపించి అంచనాలను పెంచారు. ఈ పోస్ట్‌కు ‘‘భూమి మూలాల నుండి చెప్పలేని గాథ ఒకటి బయటపడుతుంది. దసరాకు కలుద్దాం’’ అనే క్యాప్షన్ జత చేశాడు.






