ఆ విషయంలో రోహిత్ శర్మపై ఫైర్ అవుతున్న శ్రీరెడ్డి.. అసలేం జరిగిందంటే?

by Dishanational2 |
ఆ విషయంలో రోహిత్ శర్మపై ఫైర్ అవుతున్న శ్రీరెడ్డి.. అసలేం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎప్పుడూ ఎవరో ఒకరిపై వివాదాస్పద వాఖ్యలు చేస్తూ , వార్తల్లో నిలిచే హాట్ బ్యూటీ శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ బ్యూటీ స్టార్ హీరోల మీద చేసే ఆరోపణలు, బూతు పురాణం గురించి అందరికి తెలిసిందే. కాగా, తాజాగా, ఈ అమ్మడు,ప్రముఖ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసి తనదైన శైలిలో ట్వీట్ చేసింది శ్రీరెడ్డి.

లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మొదటి రోజు భారత్ పై ఆస్ట్రేలియా పై చేయి సాధించగా టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంపిక చేసుకోవడంపై ఆమె విమర్శలు చేస్తోంది. ఓవల్ ఉన్న పరిస్థితులను బట్టి టాస్ గెలిచినప్పుడు ఎవరైనా సరే బ్యాటింగ్ ఎంచుకుంటారు కానీ విరుద్ధంగా రోహిత్ బౌలింగ్ తీసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపిస్తూ తక్కువ చేసి మాట్లాడింది శ్రీరెడ్డి.

తొక్కలో కెప్టెన్సీ నీది రోహిత్.. ఇదేమన్నా నువ్వు ఐపీఎల్ అనుకుంటున్నావా.. నీ కెప్టెన్సీ చూసి కోహ్లీ కూడా నవ్వుకుంటున్నాడు.. ఇదేంట్రా బాబు అని ప్లేయర్స్ ని కోహ్లీ బాగా ఇన్స్పైర్ చేస్తాడు.ప్రపంచంలో అతడే ఉత్తమ టెస్ట్ కెప్టెన్, నువ్వేమో ఇలా చెత్తలా కెప్టెన్సీ చేస్తున్నావు అంటూ విరుచుకుపడింది.

Read more:

Sri Reddy: టైట్ అవుట్‌ఫిట్‌లో జిమ్ చేసిన శ్రీ రెడ్డి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు

గు**లో గూటం దింపేస్తా.. అరె నీ చింతకాయ పని చేస్తాదా..? టీడీపీ నేతలకు సినీనటి వార్నింగ్ (వీడియో)

Next Story

Most Viewed