పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను అర్థరాత్రి వరకు ఇబ్బంది పెట్టిన శ్రీలీల..! ఫ్యాన్స్ ఫైర్

by Disha Web Desk 6 |
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను అర్థరాత్రి వరకు ఇబ్బంది పెట్టిన శ్రీలీల..! ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పలు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. తాజాగా, ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన షేడ్యూల్ కూడా స్టార్ట్ అయింది. నిన్న ఉదయం 8 గంటలకు 12 గంటల వరకు జరిగిందట.

ఈ క్రమంలో శ్రీలీల, పవన్ కల్యాణ్‌ను వెయిట్ చేయించినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. షూటింగ్‌లో పాల్గొనాల్సిన ఈ అమ్మడు అదే సమయంలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ ఉండటంతో అక్కడికి వెళ్ళిందట. ఆ తర్వాత అది అయిపోయాక 9 గంటలకు ఉస్తాద్ షూటింగ్ సెట్‌కు వెళ్లి అర్థరాత్రి రెండు గంటల వరకు షూటింగ్‌ చేసిందట. శ్రీలీల తో పవన్ కల్యాణ్‌ కూడా ఈ షూటింగ్‌లో పాల్గొన్నాడని తెలుస్తోంది. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ డేట్స్ దొరకడం కూడా కష్టం. అలాంటిది అప్పటి వరకు పవన్‌, శ్రీ లీల కోసం అర్థరాత్రి వరకు వెయిట్ చేసాడంటే ఆయనకు వర్క్‌పై ఉన్న డెడికేషన్ అని చెప్పవచ్చు. కానీ ఈ విషయం తెలిసిన వారు మాత్రం పవన్ కల్యాణ్‌ను వెయిట్ చేయించడం ఏంటని కొందరు శ్రీలీల మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు. మరికొంత మంది మాత్రం ఆమెను అర్థం చేసుకుంటున్నారు.

Next Story