- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కీలక నిర్ణయం తీసుకున్న శ్రీలీల.. తన కోరిక బయటపెడుతూ ఆసక్తికర కామెంట్స్
ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలు, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను అలరించాను. కానీ ఇక నుంచి బలమైన సెంటిమెంట్ ఉన్న మంచి కుటుంబ కథా చిత్రాల్లో నటించాలని ఉంది.

దిశ, సినిమా: ‘పెళ్లి సందడి’ చిత్రంతో టాలీవుడ్‌లోకి మెరుపుతీగలా ఎంట్రీ ఇచ్చి, తన డ్యాన్స్‌లు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న యంగ్ బ్యూటీ శ్రీలీల. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ, అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసుకుంది. శ్రీలీల అందానికి, ఉత్సాహానికి ఫిదా అయిన దర్శకనిర్మాతలు ఆమెకు వరుసగా ఛాన్సులు ఇచ్చారు. అయితే, ఇటీవల కాలంలో ఈ బ్యూటీకి అదృష్టం అంతగా కలిసి రావడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్, రాబిన్ హుడ్, పరాశక్తి వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో భాగమైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు దక్కలేదు. గత కొన్ని చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచినా, శ్రీలీల క్రేజ్ మాత్రం తగ్గకపోవడం విశేషం. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో ధనుష్ సరసన 55వ చిత్రంలో, అలాగే హిందీలోనూ క్రేజీ ఆఫర్లతో బిజీగా ఉంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, తన లక్ష్యాన్ని వదలకుండా శ్రీలీల వైద్య విద్యను (MBBS) విజయవంతంగా పూర్తి చేసింది.
డాక్టర్ శ్రీలీలగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇప్పుడు తన సినీ కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, భవిష్యత్తులో తాను చేయబోయే పాత్రల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "ఇప్పటివరకు గ్లామరస్ పాత్రలు, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను అలరించాను. కానీ ఇక నుంచి బలమైన సెంటిమెంట్ ఉన్న మంచి కుటుంబ కథా చిత్రాల్లో నటించాలని ఉంది. నటిగా నాలోని అసలైన ప్రతిభను నిరూపించుకోవడానికి అలాంటి పాత్రలు అవసరమని భావిస్తున్నాను. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా, వైవిధ్యభరితమైన కథలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. అవి నన్ను నటిగా మరో లెవెల్‌కి తీసుకెళ్తాయని నమ్ముతున్నాను" అని శ్రీలీల చెప్పుకొచ్చింది. శ్రీలీల తీసుకున్న ఈ నిర్ణయం చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఆమె నుంచి కేవలం డ్యాన్స్‌లే కాదు, కన్నీళ్లు పెట్టించే పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కూడా ఆశించవచ్చని అర్థమవుతోంది.






