బాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీలీల.. క్యూరియాసిటీ పెంచుతున్న ట్వీట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sreeleela ) అనతి కాలంలో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది.

బాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ అందుకున్న శ్రీలీల.. క్యూరియాసిటీ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sreeleela ) అనతి కాలంలో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. ‘ధమాకా’ చిత్రంతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి శ్రీలీల ఇటీవల ‘పుష్ప-2’ మూవీలో కిస్సిక్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.

భారీ ప్రాజెక్ట్స్‌లో భాగం అయిన శ్రీలీల ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ అమ్మడు పరాశక్తి, మాస్ జాతర (mass jathara), అషికి-3, జూనియర్ వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రీలీల బాలీవుడ్‌లో ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. అట్లీ రెండో ప్రాజెక్ట్‌లో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) హీరోగా నటిస్తుండగా.. శ్రీలీల హీరోయిన్‌గా కనిపించనుంది. ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story