బాలీవుడ్ హీరోతో శ్రీ లీల మూవీ.. ఇక అన్ని బోల్డ్ సీన్లే !

by velandi.Saikiran |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు

బాలీవుడ్ హీరోతో శ్రీ లీల మూవీ.. ఇక అన్ని బోల్డ్ సీన్లే !
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రీ లీల.. ఆ తర్వాత వరుసగా టాప్ మోస్ట్ హీరోల సరసన చేసి అందరినీ మెప్పించింది. మాస్ మహారాజ్ రవితేజ, ప్రిన్స్ మహేష్ బాబు, హీరో నితిన్ లాంటి బడా హీరోలతో చేసి.. తానేంటో నిరూపించుకుంది హీరోయిన్ శ్రీ లీల.

అయితే అలాంటి హీరోయిన్ శ్రీ లీల తాజాగా జూనియర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం... థియేటర్ లలో విజయవంతంగా నడుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్, అటు కోలీవుడ్, అంటూ వరుసగా సినిమాలు వేసుకుంటూ పోతున్న... హీరోయిన్ శ్రీ లీల ఇప్పుడు బాలీవుడ్ లో కూడా కొంత ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రన్వీర్ సింగ్ తో కొత్త సినిమా చేసేందుకు శ్రీ లీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది కంప్లీట్ గా యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. ఇందులో బాబీ డియోల్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారట. అయితే ఇందులో శ్రీ లీలను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇందులో బోల్డ్ సీన్స్ కూడా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

Next Story