పవన్ కళ్యాణ్ పక్కన నటించడంపై శ్రీలీల ఆసక్తికర కామెంట్స్..

by Mallepaka Hamsa |

షూటింగ్ మొత్తంలో నాకు ఎప్పుడూ ముందుగా స్క్రిప్ట్ కానీ, డైలాగ్ పేపర్ కానీ ఇచ్చేవారు కాదు. అంతా ఆన్ ది స్పాట్ జరిగిపోయేది.

పవన్ కళ్యాణ్ పక్కన నటించడంపై శ్రీలీల ఆసక్తికర కామెంట్స్..
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకగా, తాజాగా.. ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ శ్రీలీల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. షూటింగ్ అనుభవాల గురించి ఆమె చెప్పిన విషయాలు పవన్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాయి.సాధారణంగా ఏ సినిమాకైనా నటీనటులకు ముందుగానే స్క్రిప్ట్ పేపర్లు ఇస్తారు. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్‌లో మాత్రం సీన్ వేరేలా ఉండేదట. "షూటింగ్ మొత్తంలో నాకు ఎప్పుడూ ముందుగా స్క్రిప్ట్ కానీ, డైలాగ్ పేపర్ కానీ ఇచ్చేవారు కాదు. అంతా ఆన్ ది స్పాట్ జరిగిపోయేది" అని శ్రీలీల బాంబు పేల్చింది.

హరీష్ శంకర్ మార్కు టేకింగ్‌కు, పవన్ కళ్యాణ్ ఎనర్జీకి తగ్గట్టుగా అప్పటికప్పుడు డైలాగ్స్ రావడం, వాటిని శ్రీలీల కూడా అంతే ఈజీగా పలకడం విశేషం. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడంపై శ్రీలీల ఎమోషనల్ అయ్యారు. "పవన్ కళ్యాణ్ గారి వంటి వారితో స్క్రీన్‌ను పంచుకోవడం ప్రతి నటి కల. నాకైతే ఇది కేవలం ఒక సినిమా కాదు, నా కెరీర్‌లో ఒక గర్వించదగ్గ, మరువలేని మైలురాయి" అని పేర్కొన్నారు. ఉగాది కానుకగా మార్చి 19న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్, థమన్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఉస్తాద్’ రికార్డులు తిరగరాస్తున్నాడు. మరి వెండితెరపై పవన్ కళ్యాణ్ వింటేజ్ మాస్ అవతార్ ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే!

Next Story