- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sreeleela: ఎట్టకేలకు ఎంగేజ్‌మెంట్‌పై స్పందించి క్లారిటీ ఇచ్చిన శ్రీలీల.. ఇంట్లో సెలబ్రేషన్స్ మొదలయ్యాయంటూ పోస్ట్
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sreeleela)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు అనతికాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sreeleela)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు అనతికాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ‘పెళ్లి సందడి’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె ‘ధమాకా’(Dhamaka )తో ఘన విజయం సాధించింది. దీంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. స్టార్ హీరోలు సైతం ఆమెను హీరోయిన్‌గా తమ సినిమాల్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఇక అంతా బాగుంది అనుకుంటున్న సమయంలోనే శ్రీలీల ఖాతాలో ఫ్లాపులు పడటంతో కెరీర్‌పై ప్రభావం పడింది. ఇక మళ్లీ ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) ఐటెం సాంగ్‌తో వచ్చిన శ్రీలీల డ్యాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కలిపి మొత్తం 5భారీ ప్రాజెక్ట్ ఉండటం విశేషం. షూటింగ్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి.
ఇదిలా ఉంటే.. గత రెండు రోజుల నుంచి శ్రీలీల పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆమె బిగ్ డే అంటూ.. పసుపు పెట్టించుకుంటున్న ఫొటోలు వైరల్ అవడంతో అంతా ఆమె పెళ్లి చేసుకోబోతుందని భావించారు. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చింది. తన పుట్టిన రోజు జూన్ 14న ఉండటంతో ముందుగానే తన ఇంట్లో తెలుగు సంప్రదాయం ప్రకారం సెలబ్రేట్ చేస్తారని తెలిపింది. అంతేకాకుండా ఈ సారి కూడా తన తల్లి ముందుగానే ఇంట్లో సెలబ్రేషన్స్ మొదలు పెట్టిందని తెలుపుతూ తన పెట్ డాగ్ ఫొటో షేర్ చేసింది. బ్లెస్ చేయాలంటూ ఈ రోజు డేట్ కూడా పెట్టింది. ప్రజెంట్ శ్రీలీల పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అయ్యో పుట్టినరోజును పెళ్లిగా మార్చేశారుగా అని అంటున్నారు.






