- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sreeleela: ఈ విషయంపై అతడిని సలహాలు అడిగిన శ్రీలీల.. వైరల్‌గా మారిన క్యూట్ వీడియో
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(sreeleela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(sreeleela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘ధమాకా’ మూవీతో హిట్ అందుకుని విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది. అతి తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిన ఈ అమ్మడు కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగలేదు. వరుసగా నాలుగు చిత్రాలు ఫ్లాప్ కావడంతో కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరం ఉంది. మళ్లీ ‘పుష్ప-2’ కిస్సిక్ సాంగ్‌తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ ప్రాజెక్ట్‌ల్లో భాగం అయిన ఈ భామ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.
ప్రస్తుతం శ్రీలీల ‘జూనియర్’(Junior) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కీరిటి రెడ్డి(Keeriti Reddy) హీరోగా నటిస్తున్నాడు. ఒక ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. వరాహి చలనచిత్ర బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ బ్యూటీ జెనీలియా(Genelia) కీలక పాత్రలో కనిపించనుంది. చాలాకాలం తర్వాత మళ్లీ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 18న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీమ్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.
ఈక్రమంలో.. తాజాగా, ‘జూనియర్’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతున్నట్లు టీమ్ ప్రకటించింది. అలాగే శ్రీలీల, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్(Devisree Prasad)కు సంబంధించిన క్యూట్ వీడియోను షేర్ చేసి అందరినీ మెస్మరైజ్ చేశారు. ఇక ఇందులో శ్రీలీల రాక్‌స్టార్‌కు ఫోన్ చేసి ఎలా వైరల్ కావాలో చెప్పమని అడుగుతుంది. దానికి ఆయన ఆ విషయం మీరే నాకు చెప్పాలి. నువ్వు ఒక్క వయ్యారంగా ఒక్క స్టెప్ వేస్తే క్షణాల్లో వైరల్ అవుతావని అంటారు. దీంతో అయితే మీరే ఓ మాస్ సాంగ్ చేసి పెట్టండి అని అంటుంది. ఒకే అని ‘జూనియర్’ చిత్రం నుంచి వైరల్‌వయ్యారి జూలై 4న రాబోతున్నట్లు తెలిపారు. ఈ క్యూట్ వీడియో వైరల్ అవుతోంది.






