‘ది రాజాసాబ్’నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల.. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌గా స్టార్ నటుడు

by Mallepaka Hamsa |

రెబల్ స్టార్ ప్రభాస్(prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(maruthi) కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘ది రాజాసాబ్’(the rajasab).

‘ది రాజాసాబ్’నుంచి  స్పెషల్ పోస్టర్ విడుదల.. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌గా స్టార్ నటుడు
X

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్(prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(maruthi) కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘ది రాజాసాబ్’(the rajasab). ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో రూపొందుతోంది. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు వెర్సటైల్ యాక్టర్ బొమన్ ఇరానీ. ఈ రోజు బొమన్ ఇరానీ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ‘రాజా సాబ్’ సినిమాలో సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌గా బొమన్ ఇరానీ క్యారెక్టర్ ప్రేక్షకులను థ్రిల్ చేయనుందని సమాచారం.

సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ‘రాజా సాబ్’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. హారర్ కామెడీ జానర్‌గా ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఇటీవల రిలీజ్ చేసిన ‘రాజా సాబ్’ ఫస్ట్ లిరికల్ సాంగ్ 'రెబల్ సాబ్' హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ‘రాజా సాబ్’పై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా? అని ప్రభాస్ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Next Story