- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్.. ‘35 చిన్న కథ కాదు’ నుంచి స్పెషల్ గ్లింప్స్
హీరోయిన్ నివేదా థామస్ చాలా గ్యాప్ తర్వాత ‘35 చిన్న కథ కాదు’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

దిశ, సినిమా: హీరోయిన్ నివేదా థామస్ చాలా గ్యాప్ తర్వాత ‘35 చిన్న కథ కాదు’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. డెబ్యూ డైరెక్టర్ నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి సమర్పిస్తున్నాడు. ప్రియదర్శి, యువ నటుడు విశ్వదేవ్ ప్రధాన్ పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు చిత్ర బృందం.
ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలో హీరో విశ్వదేవ్‌ను ప్రసాద్‌గా పరిచయం చేస్తూ స్పెషల్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. విశ్వదేవ్‌ను కేరింగ్ అండ్ రెస్పాన్స్ బుల్ మిడిల్ క్లాస్ ఫాదర్‌గా ప్రజెంట్ చేసిన ఈ గ్లింప్స్ చాలా ఇంట్రెస్టింగా ఉంది. విశ్వదేవ్ రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. క్యారెక్టర్ ఎసెన్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసిన గ్లింప్స్ చాలా క్యురియాసిటీని పెంచింది.






