సౌత్ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార బ్రదర్ ఎవరో తెలుసా? పిక్ వైరల్

by Kodari Anjali |

సౌత్‌లో చెరగని ముద్ర వేసుకుంది స్టార్ హీరోయిన్ నయనతార.

సౌత్ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార బ్రదర్ ఎవరో తెలుసా? పిక్ వైరల్
X

దిశ, సినిమా: సౌత్‌లో చెరగని ముద్ర వేసుకుంది స్టార్ హీరోయిన్ నయనతార. అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకుంటోన్న హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, విజయ్, జూనియర్ ఎన్టీఆర్, సూర్య, విక్రమ్, అజిత్ వంటి అగ్ర హీరోల సరసన నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

తమిళంతో పాటు, మలయాళం, హిందీ, తెలుగు సినిమాల్లో అద్భుతంగా నటించి.. లేడీ సూపర్ స్టార్‌గా పేరు దక్కించుకుంది. జవాన్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండేళ్ల క్రితం దర్శకుడు విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకుని.. ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.

ఈ బ్యూటీ కేరళకు చెందినదైనప్పటికీ చెన్నైలో సెటిల్ అయింది. నయనతార అసలు పేరు డయానా. కురియన్ కొడియాతు - ఒమన్ నయనతార తల్లిదండ్రులు. సోదరుడు లెనో. ఫ్యాన్స్‌కు నయనతార పేరెంట్స్ గురించి తెలిసినప్పటికి బ్రదర్ లెనో గురించి ఎవరికి తెలియదు. ఆయన ఎవరు? ఏం చేస్తాడు? అనేది ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా ఈ లేడీ సూపర్ స్టార్ నయన్, విఘ్నేష్ శివన్, లెనో కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార, విఘ్నేష్ ఇద్దరి భుజాలపై చేతులు వేసి.. కౌగిలించుకుని లెనో ఫొటోకు స్టిల్ ఇచ్చాడు. ప్రస్తుతం లెనో దుబాయ్‌లో ఉంటున్నారట. అక్కడ ఈయన బిజినెస్ చేస్తున్నాడట. సోదరుడి ద్వారా దుబాయ్‌లో నయన్ కూడా బిజినెస్ చేస్తుందని సమాచారం. ప్రస్తుతం నయనతార.. భర్త విఘ్నేష్, బ్రదర్ లెనో కలిసి దిగిన పిక్ నెట్టింట వైరల్‌గా మారింది.



Next Story