గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్.. నువ్వు దేవుడివి అంటూ నెటిజన్ల ప్రశంసలు

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్(Sonu Sood) సినిమాలకు గ్యాప్ ఇచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టారు.

గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్.. నువ్వు దేవుడివి అంటూ నెటిజన్ల ప్రశంసలు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్(Sonu Sood) సినిమాలకు గ్యాప్ ఇచ్చి సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయం నుంచి ఆయన ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. తనను సాయం అంటూ కోరిన వారి కష్టాలు తీరుస్తూ రియల్ హీరోగా మారిపోయారు. నిత్యం ఎంతో మందికి సహాయం చేస్తూ స్టార్ హీరోల అందరి కంటే ఎక్కువ పాపులారిటీ దక్కించుకున్నారు. ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. అంతేకాకుండా ఓ ఫౌండేషన్ పెట్టి ఎంతో మంది పేదలకు సహాయం అందిస్తున్నారు. తాజాగా, సోనూసూద్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. తన ఫౌండేషన్ ద్వారా దేశంలో ఉన్న 500 మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్ చికిత్స చేయించారు.

ఈ విషయంపై సోనూసూద్ మాట్లాడుతూ.. ‘‘మొత్తం 500మందికి పైగా శస్త్రచికిత్సలు జరిగాయి. 500 మంది మహిళలను మేము కాపాడగలిగాం. వారంతా కొత్త జీవితాన్ని పొందారని వారి కుటుంబాల్లో ఆనందం నింపినందుకు సంతోషంగా ఉన్నానని అన్నారు. సమిష్టి కృషి ద్వారా మాత్రమే ఇలాంటి గొప్ప పనులు జరుగుతాయని పేర్కొన్నారు. ఇది ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఆయన మంచి మనసు గురించి తెలుసుకున్న వారంతా నువ్వు దేవుడివి స్వామి అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story