- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పని మనుషుల కోసం సోనమ్ కీలక నిర్ణయం.. రూ. 51కోట్ల ఫ్లాట్ కోనుగోలు చేసిందా?
ఈ వివాదం పెద్దదవ్వడంతో సోనమ్ కపూర్ ప్రతినిధులు స్పందించారు. ఈ కొనుగోళ్లతో కపూర్ కుటుంబానికి లేదా ఆనంద్ అహుజాకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ జంట ఇప్పటికే లండన్‌లోని నాటింగ్ హిల్స్ ప్రాంతంలో సుమారు రూ. 270 కోట్ల విలువైన భారీ బంగ్లాను కొనుగోలు చేసి, దాన్ని రీ-డెవలప్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా అదే ప్రాంతంలో మరో రూ. 51 కోట్ల ఖర్చుతో ఐదు ఫ్లాట్లను కొనుగోలు చేశారట. ఈ ఫ్లాట్లను వారు తమ సెక్యూరిటీ, వంట మనుషులు, ఇతర గృహ సిబ్బంది నివాసం కోసం కేటాయించారనే వార్త బయటకు రావడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. "బిలియనీర్లు మా ప్రశాంతమైన నివాస ప్రాంతాన్ని తమకు నచ్చినట్లు మార్చేస్తున్నారు" అని స్థానికులు కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ భారీ మార్పులు చేస్తున్నారని, తాము దీనిపై అభ్యంతరం చెబితే బెదిరింపులు కూడా వస్తున్నాయని కొందరు ఆరోపించారు. ఈ నిర్మాణాల వల్ల ఆ వీధిలో ట్రాఫిక్ పెరగడమే కాకుండా, ప్రశాంతత దెబ్బతింటుందని వారు వాదిస్తున్నారు. ఈ వివాదం పెద్దదవ్వడంతో సోనమ్ కపూర్ ప్రతినిధులు స్పందించారు. ఈ కొనుగోళ్లతో కపూర్ కుటుంబానికి లేదా ఆనంద్ అహుజాకు నేరుగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆస్తులను కేవలం ఒక వ్యాపార పెట్టుబడి లాగా మాత్రమే ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా కొనుగోలు చేశారని, స్థానికులను బెదిరించారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు తేల్చి చెప్పారు. అక్కడి స్థానికులకు మధ్య జరుగుతున్న ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.






